ప్రియుడిపై ఓ ప్రియురాలు యాసిడ్‌తో దాడి చేసింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరుకు చెందిన ఓర్పు వెంకటేశ్ ఓ వాటర్ ప్లాంట్‌లో పని చేస్తుంటాడు. వాటర్‌ను వ్యాన్‌లో తీసుకెళ్లి డోర్ డెలివరీ చేస్తుంటాడు. ఈ క్రమంలో వెంకటేశ్‌కు రామిరెడ్డితోటలో నివసించే రాధ అనే మహిళ పరిచయమైంది. వెంకటేశ్, రాధకు మధ్య స్నేహం పెరిగి సహజీవనానికి దారి తీసింది. వీరి బంధాన్ని కుటుంబీకులు వ్యతిరేకించారు. దాంతో ఆమె వెంకటేశ్‌పై యాసిడ్ దాడి చేసింది.