రాష్ట్రంలో అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ జగనే ప్రజలు ముఖ్యమంత్రిగా చేయాలని ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు, జిల్లావైసీపీ అధ్యక్షులు బొడ్డోడ ప్రసాద్ అన్నారు. అచ్చుతాపురం లేపాక్షి కల్యాణ మండపంలో కార్యకర్తలతోగురువారం మళ్లీ జగనే ఎందుకు కావాలి అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలోనే అమలు జరుగుతున్నాయన్నారు.