వైఎస్ఆర్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కడప కో-ఆపరేటివ్ కాలనీకి చెందిన హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు.. తన భార్య, ఇద్దరు పిల్లలను రివాల్వర్‌తో కాల్చి చంపాడు. అనతరం తాను కాల్చుకునీ ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, వెంకటేశ్వర్లు.. కడప టూ టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నాడు.