గుంతకల్లు మండలంలోని ప్రజా పంపిణీ వ్యవస్థ డీలర్ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని నూతన తహశీల్దారు కె. ప్రతాప రెడ్డి డీలర్లకు హామీ ఇచ్చారు. స్టోర్ డీలర్ల సంఘం రాష్ట్ర నాయకుడు జింకల వెంకటేష్ ఆధ్వర్యంలో బుధవారం డీలర్లు తహశీల్దారును మర్యాద పూర్వకంగా కలిసిన శాలువా, పూల మాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా స్టాక్ పాయింట్లో డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలు వెంకటేష్ నూతన తహశీల్దారు దృష్టికి తెచ్చారు.