గుంతకల్లు పట్టణం కసాపురం రోడ్డులోని ఏబి ఫంక్షన్ హాలు సమీపంలో రూ. 2. 50 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించనున్న విద్యుత్తు ఉప కేంద్రం నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే వై. వెంకట్రామిరెడ్డి, విద్యుత్తు శాఖ ఎస్ఇ సురేంద్ర భూమి పూజ చేశారు. ఈ నిర్మాణం పూర్తి అయితే కసాపురం రోడ్డు పరిసర ప్రాంతాల్లో లో ఓల్టేజి సమస్య పరిష్కారం అవుతుందని ఎమ్మెల్యే అన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ భవాని, కమిషనర్ మల్లికార్జున ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa