స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా నెల్లూరులో నిరసన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నిరసనలో పాల్గొన్న 16 మంది ప్రతిపక్ష నేతలపై పొలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకపోయినా ర్యాలీ నిర్వహించినందుకే కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. టీడీపీ నేతలు పనబాక లక్ష్మి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి సహా జనసేన, సీపీఐ నేతలపై కేసు నమోదైంది.