సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా చేసిన ఆరోపణలను వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి తిప్పికొట్టారు. నీ స్థాయికి మించిన మాటలెందుకు అంటూ ప్రకాశ్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి పదేళ్ల రాజధాని హక్కును వదిలేసి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చింది ఎవరు.?కడప ఉక్కు పరిశ్రమని అడ్డుకున్నది ఎవరు.? కృష్ణా జలాలు రాయలసీమకు వెళ్లకుండా అడ్డుకున్నది ఎవరు.? నేనూ సీమ బిడ్డనే అని చెప్పుకుంటూనే 14 ఏళ్ల పాలనలో సీమ ప్రాజెక్టులను పట్టించుకోనిది ఎవరు.?ఎన్డీయేలో ఉంటూ ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు అని కూసింది ఎవరు.? తరువాత అదే బీజేపీ అన్యాయం చేసింది అంటూ ధర్మపోరాట దీక్షలు చేసిందెవరు.? అన్నీ మర్చిపోయి ఇప్పుడు కొత్తగా ఇలా ప్రశ్నిస్తే ఎలా.? నీకు బుద్ధి, జ్ఞానం ఉంటే అవే ప్రశ్నలు మీ నాన్న చంద్రబాబును అడుగు.. సమాధానాలు రాబట్టు పప్పు అంటూ తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి రీ ట్వీట్ చేశారు.