తిరుపతిలోని ఒక లాడ్జిలో దారుణం జరిగింది. మహారాష్ట్ర లోని నాందేడ్ ప్రాంతానికి చెందిన అన్నాచెల్లెలు దారుణ హత్యకు గురయ్యారు. అనుమానంతో భార్యను, ఆమె సోదరుడిని భర్త హతమార్చాడని తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్ళితే... నాంథేడ్‌కు చెందిన యువరాజ్ అనే వ్యక్తికి మనీసా అనే మహిళతో పన్నిండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి షక్షమ్(6), ప్రజ్ఞాన్ (4) అనే ఇద్దరు పిల్లలున్నారు. అయితే తిరుమల శ్రీవారి దర్శనానికి యువరాజ్, మనీషాలతో పాటు ఆమె సోదరుడు హర్షవర్ధన్ తిరుపతికి వెళ్లారు. అక్కడ ఓరియన్ హోటల్‌లో రూం తీసుకున్నారు. ఏమైందో ఏమో కానీ యువరాజ్.. భార్యతో పాటు ఆమె సోదరుడు హర్షవర్ధన్‌ని సైతం హతమార్చాడు. యువరాజ్‌ను అలిపిరి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ నిర్వహిస్తున్నారు.