టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు సరికాదు. దీనిని మేం ఖండిస్తున్నాం. కేసు ప్రస్తుతం కోర్టులో ఉన్నందున, దీనిపై ఎక్కువ మాట్లాడలేను అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు.అలానే అయన మాట్లాడుతూ.... పవన్ కల్యాణ్ వైఖరిలో స్పష్టత లేదు. ఒకవైపు బీజేపీతో కలిసి ఉంటూనే మరోవైపు టీడీపీతో కలవాలని అనుకుంటున్నారు. ఒకసారి ఎన్డీఏతో దూరమంటారు... అదే సమయంలో ప్రధాని మోదీతో మాట్లాడాలంటారు. మత సామరస్యం, రాజ్యాంగ స్ఫూర్తి పరిరక్షించాలంటే ఇండియా కూటమి అధికారంలోకి రావాలి అని సీతారాం ఏచూరి అన్నారు.