అర్హులకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైకాపాకే దక్కుతుందని మంత్రి విడదల రజిని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే అనే కార్యక్రమం అవగాహన సదస్సును చిలకలూరిపేట ఆర్యవైశ్య కల్యాణ మండపంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో పురపాలక సంఘ ఛైర్మన్ ఎస్కే రఫాని, మార్కెట్ యార్డు ఛైర్మన్ తోట రాజేంద్రప్రసాద్, నాయకులు విడదల గోపి, కమలేంద్ర, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.