మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు సహా 67 మంది టీడీపీ నేతలకు హైకోర్టులో ఊరట లభించింది. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో చిలకలూరిపేట హైవేపై భారీగా వాహనాలతో చేరుకొని పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ కేసులు నమోదయ్యాయి. దీంతో టీడీపీ నేతలు వేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు. . ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని, 41A నోటీసులు ఇచ్చి వారిని విచారించాలని ఆదేశాలు జారీ చేసింది.