గ్రామీణ స్వయం సహాయక శిక్షణ సంస్థ అందిస్తున్న అవకాశాలను మహిళలంతా సద్వినియోగం చేసుకోవాలని ఎన్బీఐ శిక్షణ సంస్థ డైరెక్టరు బి. విజయ కుమార్ సూచించారు. కశింకోట వెలుగు కార్యాలయంలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఉచిత భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తున్నామని, ఆసక్తి గల అభ్యర్థులు వినియోగించుకోవాలన్నారు. మహిళలు కుట్టు పని, బ్యూటీ పార్లర్, మగ్గం వర్క్ లను ఎంపిక చేసుకొని శిక్షణతో స్వయం ఉపాధి పొందాలన్నారు.