రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 'ప్రభుత్వ విద్యా పరిరక్షణ పై సదస్సు' ఈ నెల 8న శ్రీనగర్ లోని విశాఖ పౌరగ్రంథాలయంలో నిర్వహించనున్నట్లు ఆ సంఘం కన్వీనర్ కట్టా మల్లేశ్వరరావు తెలిపారు. జీవో నం. 117 రద్దు, విలీనం పేరుతో పాఠశాలలు మూసివేత, ఖాళీగా ఉన్న 50 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, పదివేల ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయల నియామకం వంటివి డిమాండ్ చేస్తూ సదస్సులో చర్చించనున్నన్నారు.