జగనన్న ఆరోగ్య సురక్ష దేశానికే ఆదర్శమని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అన్నారు. ఎస్. కోట మండలం అలుగుబిల్లిలో శనివారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించి, వైద్యులు రోగులకు అందిస్తున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. 45 రోజులు పాటు కొనసాగే ఈ కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సోమేశ్వరరావు, వైస్ ఎంపీపీ సుధారాజు తదితరులు పాల్గొన్నారు.