ఎల్. కోట మండలం మల్లివీడులో శనివారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు శనివారం సందర్శించారు. అనంతర ప్రజలకు వైద్యులు అందిస్తున్న వైద్య సేవలను ఆయన పరిశీలించారు. ప్రజారోగ్యానికి సీఎం జగన్ పెద్దపేట వేస్తున్నారని, ఆరోగ్య సురక్షను ప్రజలు వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పిటిసి వరలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.