పవన్ ఎప్పుడు ఏ పార్టీతో ఉంటాడో ఆయనకే తెలియదని కొడాలి నాని ఎద్దేవా చేశారు. మీడియాతో అయన మాట్లాడుతూ..... టీడీపీతో కలిసి వెళ్తానని పవన్ చెబుతున్నాడు. టీడీపీతో కలిసేదేలేదని బీజేపీ నేతలు స్పష్టంగా చెబుతున్నారు. అలాంటప్పుడు పవన్ ఎన్డీయే కూటమిలో ఉన్నట్టా.. లేనట్టా?. పవన్ బీజేపీతో కలిసి ఉన్నా.. వారితో ఎన్నికలకు వెళ్తానని పవన్ చెప్పడం లేదు. 151 స్థానాల్లో గెలిచిన వైయస్ఆర్‌సీపీ.. ఎవరు ఎవరితో కలిసి వచ్చినా భయపడేది లేదన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన 130 స్థానాల్లో డిపాజిట్లు కూడా రాని పవన్ ఇవాళ రెచ్చిపోతున్నాడు. జనసేన వంటి పార్టీలు చాలా వచ్చాయి.. అడ్రస్ కూడా లేకుండా పోయాయి. చంద్రబాబు దారిలోనే పవన్ కూడా వెళ్తున్నాడు. అరిచే కుక్క కరవదు.. కరిచే కుక్క మొరగదు అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. పవన్ భాషను అందరూ అర్థం చేసుకోవాలి. మేం రూపాయి పావలా అయితే..ఆయనో పావలా కల్యాణ్. చంద్రబాబుకు బెయిల్ వచ్చే వరకూ కొవ్వొత్తులు పట్టుకుని తిరగమనండి.. మాకేం నష్టం లేదంటూ కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు.