భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆదివారం జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచులో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు చెప్పాడు. ఆదివారం తాము మరోసారి పిచ్‌ను పరిశీలిస్తామని, ఏదేమైనా ముగ్గురు స్పిన్నర్లను తీసుకోవడమే మంచి ఆప్షన్ అని అభిప్రాయపడ్డాడు. ఇక్కడ గతంలో చేసిన పొరపాట్ల నుంచి టీమిండియా పాఠాలు నేర్చుకుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa