ఏలూరు కు చెందిన మిడతాని నాగమణి(57) ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ తన స్నేహితుడు నవీన్ తో ఈ నెల 6వతేదీన బైక్ పై గుంటూరు ప్రయాణిస్తూ నంబూరు వద్దకు వచ్చేసరికి బైక్ అదుపుతప్పి డివైడర్ కు ఢీకొంది. ఈ ఘటనలో నాగమణి తలకు గాయం కాగా గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యం పొందుతున్న నాగమణి గత శనివారం మరణించింది. మృతురాలి కొడుకు దుర్గారావు ఫిర్యాదు మేరకు పెదకాకాని పోలీసులు కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa