భారత్‌లో రంజాన్ నెలవంక కనిపించడంతో, పవిత్ర రంజాన్ మాసం ఉపవాస దీక్షలు రేపటి (గురువారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల రోజుల పాటు ప్రత్యేక నమాజ్‌లు నిర్వహించబడతాయి. ఈ మాసంలో ప్రతి రోజూ తెల్లవారు జామునుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. ప్రత్యేక ప్రార్థనలు, ఆధ్యాత్మిక చింతన, దానధర్మాలు చేస్తారు. రంజాన్ ఇస్లామిక్ చాంద్రమాన క్యాలెండర్లో తొమ్మిదవ నెల, ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అత్యంత పవిత్రమైన నెలగా భావిస్తారు. పవిత్ర మాసానికి ముందే రాష్ట్రవ్యాప్తంగా చాలా మసీదులు అందంగా ముస్తాబు చేశారు. ఇస్లాం నాల్గవ మూల స్తంభం ఉపవాసం. ఉపవాసాన్ని అరబీబాష ఇస్లాం దర్శశాస్త్ర పరిభాషలో సామ్ అంటారు. ఉపవాసం అంటే అల్లాహ్ ప్రసన్నత కోసం అల్లాహ్ ఆరాధన ఉద్దేశంతో ఉషోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అన్నపానీయాలకు దూరంగా ఉండడంతో పాటు ఉపవాసానికి భంగపరుచు కార్యాలన్నింటికీ విడనాడడం. ఉపవాసాలను ముస్లీంలకు ఫర్జ్ (విధి)గా నిర్ణయించబడింది. ధర్మపరమైన కారణాలు లేకుండా ఉపవాసం పాటించినట్లయితే అతను ఫాసిక్ దురాచారి అవుతాడని హదీస్ చెబుతోంది.
ఉపవాస సంకల్పంతో ఉషోదయానికి ముందు తెలవారుజామున ఏదైనా అల్పాహారం తినడం, తాగడాన్ని సహెరి అంటారు. సహెరి భుజించడం ప్రవక్త సంప్రదాయం. సూర్యుడు అస్తమించిన తర్వాత ఉపవాసం విరమించడాన్ని ఇఫ్తార్ అంటారు. సూర్యుడు అస్తమించినట్లు తెలిస్తే ఉపవాసాన్ని వెంటనే విరమించాలి. ఇస్లాం ధర్మశాస్త్రంలో ఉపవాసం (రోజ) పగలు మాత్రమే. ఇఫ్తార్ విందు ఇచ్చేవారికి అల్లాహ్ ఎంతో పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడని ప్రవక్త తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa