పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా అద్దంకి నియోజకవర్గ ముస్లిం సోదరుల కోసం గొట్టిపాటి యూత్ రూపొందించిన ఉపవాస జేబు క్యాలెండర్‌ను బుధవారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, దుల్హన్ పథకం, హజ్ సాయం, ఇమామ్–మౌజన్‌లకు గౌరవ వేతనాలు, 4% రిజర్వేషన్ల రక్షణ, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐటిడిపి నాయకులు మరియు ముస్లిం సమాజ ప్రతినిధులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa