అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు మునుపెన్నడూ లేని విధంగా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగంలో టాప్-10 జాబితాలో ఏకంగా నలుగురు టీమ్ ఇండియా ఆటగాళ్లు చోటు సంపాదించడం విశేషం. యువ సంచలనం అభిషేక్ శర్మ తన అద్భుతమైన ఫామ్‌తో ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా నిలిచి చరిత్ర సృష్టించాడు. నిలకడైన ప్రదర్శనతో జట్టుకు వెన్నుముకగా మారుతున్న ఈ కుర్రాడు, అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడం భారత క్రికెట్ భవిష్యత్తుకు శుభసూచకంగా కనిపిస్తోంది.
యువ ఆటగాడు తిలక్ వర్మ సైతం తన బ్యాటింగ్‌తో సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ 4వ స్థానానికి చేరుకున్నారు. ఇక టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ 6వ స్థానంలో కొనసాగుతుండగా, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అనూహ్యంగా 8వ స్థానానికి ఎగబాకారు. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్‌లో వరుసగా రెండు అర్ధసెంచరీలతో మెరవడంతో ఇషాన్ తన ర్యాంకింగ్‌ను మెరుగుపరుచుకోగలిగారు. ఇలా నలుగురు బ్యాటర్లు టాప్-10లో ఉండటం భారత బ్యాటింగ్ లైనప్ ఎంత పటిష్టంగా ఉందో నిరూపిస్తోంది.
ఆల్‌రౌండర్ల విభాగంలోనూ భారత్ తన ముద్రను బలంగా వేసింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య తన అద్భుత ప్రదర్శనతో 3వ స్థానంలో నిలవగా, పవర్ఫుల్ హిట్టర్ శివమ్ దూబే 9వ స్థానాన్ని దక్కించుకున్నారు. కీలక సమయాల్లో బంతితోనూ, బ్యాటుతోనూ రాణిస్తూ వీరు జట్టుకు సమతూకాన్ని అందిస్తున్నారు. ఫీల్డింగ్, బౌలింగ్ మరియు బ్యాటింగ్.. ఇలా అన్ని విభాగాల్లోనూ భారత ఆటగాళ్లు ప్రపంచ శ్రేణి ప్రదర్శన ఇస్తుండటంతో టీమ్ ఇండియా పొట్టి ఫార్మాట్లో తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది.
బౌలింగ్ విభాగంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సంచలనం సృష్టించారు. తన వైవిధ్యమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్న ఆయన, ఐసీసీ బౌలర్ల జాబితాలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ, బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి ఇద్దరూ అగ్రస్థానాల్లో ఉండటం భారత అభిమానులకు పండగ లాంటి వార్త అనే చెప్పాలి. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ చూపిస్తున్న ఈ హవా, రాబోయే సిరీస్‌లలో కూడా జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత రెట్టింపు చేయడం ఖాయం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa