గుంటూరు జిల్లా ప్రత్తిపాడు గ్రామానికి చెందిన గన్నవరపు మల్లేశ్వరి, శ్రీనివాసరావు భార్యాభర్తలు వీరికి ముగ్గురు సంతానం. గత కొన్ని సంవత్సరాల నుంచి శ్రీనివాసరావు ఇంట్లో పోషణ కూడా నగదు ఇవ్వకుండా నిత్యం భార్యను తిడుతూ శారీరకంగా మానసికంగా తీవ్రంగా హింసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో భార్య మల్లేశ్వరి శనివారం ప్రతిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ రవీంద్రబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa