అమరావతితోపాటు వెనుకబడిన రాయలసీమను అభివృద్ధి చేయాలన్న ఆలోచన చంద్రబాబుకి ఉంటే తక్షణం రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేసి చిత్తశుద్ధిని చూపించాలని అనంతపురం జిల్లా వైయస్ఆర్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రయోజనాల కోసం రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ పనులు చంద్రబాబు ఆపేసినట్టు తేలిపోయిందని చెప్పారు. రేవంత్ రెడ్డి మాటలను ఖండించాల్సిన చంద్రబాబు, 20 టీఎంసీల కోసం ఎందుకంత రాద్ధాంతం అని మాట్లాడటం రాయలసీమకు వెన్నుపోటు పొడవడమేనని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం తక్షణం స్పందించి రాయలసీమ లిఫ్టు పెండింగ్ పనులు పూర్తి చేసే వరకు ఊరుకునేది లేదని, రాజకీయాలకు అతీతంగా సాగునీటిరంగ నిపుణులు, మేధావులు, రాయలసీమ ఉద్యమకారులతో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని వారు హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa