ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీటీడీని టీడీపీకి అనుబంధ సంస్థగా మార్చేశారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 19, 2026, 10:38 AM

పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అధికార తెలుగుదేశం పార్టీకి అనుబంధ సంస్థగా మార్చిన పాలకమండలి తీరుపై టీటీడీ మాజీ చైర్మన్, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నెయ్యి టెండర్లలో జరిగిన అక్రమాలను ఆధారాలతో చూపించారు.  టీటీడీ విడుదల చేసిన వివరణాత్మక ప్రకటనను చూస్తుంటే అది దేవస్థానం ఇచ్చిందా లేక టీడీపీ కార్యాలయం నుంచి వచ్చిందా అనే అనుమానం కలుగుతోందన్నారు. హెరిటేజ్ సంస్థ గురించి టీటీడీ  ఎలా వివరణ ఇస్తుందని ప్రశ్నించిన ఆయన... టీడీపీని ప్రశ్నిస్తే టీటీడీ ఎందుకు సమాధానం చెబుతోందని నిలదీశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తన సోషల్ మీడియా ఖాతాల్లో ఆ ప్రకటనలను షేర్ చేయడం ద్వారా టీటీడీని టీడీపీకి అనుబంధ సంస్థగా మార్చేశారని స్పష్టమవుతోంది" అని ఆయన మండిపడ్డారు.  ఇందాపూర్ డెయిరీ కోసమే గతంలో సేకరణ పరిధి 1500 కిలోమీటర్లు ఉంటే, దాన్ని 800 కిలోమీటర్లకు కుదించారని, కేవలం చంద్రబాబు సొంత సంస్ధలకు లబ్ది చేకూర్చేందుకే  నెయ్యి సరఫరా టెండర్ల ప్రక్రియలో నిబంధనలను తుంగలో తొక్కారని భూమన మండిపడ్డారు. వారి అక్రమాలు బయటపడ్డం తట్టుకోలేక చివరకు ఆలయంలో ఉద్యోగులు, వేదపారాయణదారులను సైతం బెదిరింపులకు దిగడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. టీటీడీ స్వయంప్రతిపత్తిని కాపాడాలని, రాజకీయ అవసరాల కోసం శ్రీవారి ప్రతిష్టను దిగజార్చవద్దని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa