ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కెనడాలో భారతీయులకు కఠిన నిబంధనలు: వేలమంది బహిష్కరణ

international |  Suryaa Desk  | Published : Thu, Feb 19, 2026, 10:54 AM

కెనడా ప్రభుత్వం అక్రమ వలసలపై కఠిన చర్యలు తీసుకుంటోంది. గతేడాది తొలి పది నెలల్లో 18,785 మందిని దేశం నుంచి వెనక్కి పంపగా, వీరిలో 2,800 మంది భారతీయులు ఉన్నారు. ఇప్పుడు మరో 29,500 మందిని బహిష్కరించే ప్రక్రియ కొనసాగుతోంది, వీరిలో 6,000 మందికి పైగా భారతీయులు ఉన్నారు. సరైన పత్రాలు లేకపోవడం, వీసా గడువు ముగిసినా ఉండటం, నేరాల్లో ఇరుక్కోవడం వంటి కారణాలతో బహిష్కరణలు జరుగుతున్నాయి. కెనడాలో చట్టాలను అతిక్రమించిన వారికి డిపార్చర్ ఆర్డర్, ఎక్స్‌క్లూజన్ ఆర్డర్, డిపోర్టేషన్ ఆర్డర్ వంటి మూడు రకాల నోటీసులు జారీ చేస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa