ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు 'ధనదాహం' కోసం దేవుడి నైవేద్యాన్ని సైతం అపచారం చేస్తున్నాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 19, 2026, 10:24 AM

పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రచారాలను శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, బడ్జెట్ లోని డొల్లతనాన్ని ఎండగట్టారు.తిరుమల లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని గతంలో చంద్రబాబు చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని బొత్స విమర్శించారు. సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ సిట్ నివేదికతో చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని తేలిపోయిందని ఆయన స్పష్టం చేశారు. దేవుడి నైవేద్యాన్ని కూడా వదలకుండా తన 'ధనదాహం' కోసం అపచారం చేస్తున్నారని మండిపడ్డారు. అందులో భాగంగానే గతంలో కిలో రూ.320కే లభించిన నెయ్యిని, ఇవాళ చంద్రబాబు తన సొంత సంస్థ అయిన హెరిటేజ్ తో సంబంధాలున్న ఇందాపూర్ డెయిరీ ద్వారా కిలో రూ.700 కు సరఫరా చేస్తూ ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని బొత్స నిలదీశారు. రూ.320 నుంచి రూ.700 కు ధరను రెట్టింపు చేయడం వెనుక ఉన్న అవినీతిపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. మరోవైపు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా వట్టి డొల్ల అని తేల్చి చెప్పారు. సభలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయనే భయంతోనే ప్రభుత్వం చర్చకు రావడం లేదన్న బొత్స సత్యనారాయణ.. దమ్ముంటే పూర్తిస్థాయి చర్చకు రావాలని డిమాండ్ చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa