విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని దూరం చేసే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పది, పన్నెండో తరగతి బోర్డు పరీక్షలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏడాదిలో రెండుసార్లు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. రెండు పరీక్షలు రాయాలా? లేదా ఒక్క పరీక్షకే హాజరు కావాలా? అనేది పూర్తిగా విద్యార్థుల ఇష్టమే అని స్పష్టం చేసింది. ఈ ఆప్షన్ ఐచ్ఛికమే తప్ప, నిర్బంధం కాదని వివరించింది.