ఆఫ్గానిస్థాన్‌లోని హీరట్ పరిసరాల్లో శనివారం సంభవించిన భూకంపం భారీ విలయాన్ని సృష్టించింది. భూకంపం కారణంగా ఇప్పటి వరకు 2,445 మరణించారని, మరో 2 వేల గాయపడ్డారని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా, భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఎటూ చూసినా శవాల దిబ్బలే దర్శనమిస్తున్నాయి. వందలాది మంది శిథిలాల కింద చిక్కుకోగా.. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.