విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా వైసీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు వైసీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు దాదాపు 8 వేల మందికిపైగా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు.