గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా వేలాది ఇళ్లను సందర్శించామని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు తెలిపారు. చెరుకుపల్లి మండలం బలుసులపాలెం పంచాయతీలో ఆదివారం రాత్రి గడపగడపకు మన ప్రభుత్వం ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. చెరుకుపల్లి మండలంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తి అయిన సందర్భంగా కేక్ కట్ చేశారు. పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.