ప్రకాశం జిల్లా కంభం మండలం జంగం గుంట్ల గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఓ లారీ సోమవారం ఉదయం బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన ఉన్న వైయస్సార్ హనుమాన్, విగ్రహాలను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ విగ్రహాలు ధ్వంసమయ్యాయి. అలానే పక్కనే ఉన్న చిరు దుకాణాన్ని కూడా లారీ ఢీకొనింది. సంఘటన చోటుచేసుకున్న సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణా నష్టం తప్పిందని పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa