పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ఎం.లోకే్షబాబు(49) ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురవడంతో కుటుంబ సభ్యులు విజయవాడలోని క్యాపిటల్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడి వైద్యులు పరీక్షించి అతని బ్రెయిన్ డెడ్ అయినట్టు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు లోకే్షబాబు అవయవాలను దానం చేసేందుకు ముందుకు రావడంతో ఆయన శరీరంలోని పలు అవయవాలను పలు ఆస్పత్రులకు తరలించారు. శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయం డైరెక్టర్ శ్రీనాథ రెడ్డి విజయవాడలోని క్యాపిటల్ ఆస్పత్రికి చేరుకొని లోకే్షబాబు గుండెను గ్రీన్ చానల్ ద్వారా ప్రత్యేక విమానంలో ఆదివారం సాయంత్రం తిరుపతికి తీసుకువచ్చారు. ఈ గుండెను కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన డి.కరుణాకర్ (39)కు అమర్చారు.