చంద్రబాబు అరెస్టుపై ఆయనతో పనిచేసిన కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రశ్నించారు. చంద్రబాబును అక్రమంగా జైలుకు పంపించినందుకు అందరూ స్పందిస్తున్నారని, తెలంగాణలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేల్లో చాలామంది చంద్రబాబు భిక్షతో నేడు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నారన్నారు. ఇంత జరుగుతున్నా వారందరూ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టు తెలంగాణలో ఎన్నికలపై ప్రభావం చూపుతుందని చెప్పారు. చంద్రబాబు అవినీతికి పాల్పడలేదు గనుకనే బెయిల్ కోసం ప్రయత్నించలేదని, జగన్ రూ.43వేల కోట్ల అవినీతికి పాల్పడ్డాడు గనుకనే బెయిల్ తెచ్చుకున్నారని విమర్శించారు.