అవినీతి ప్రభుత్వాన్ని తరిమేద్దామని, ప్రజాప్రభుత్వాన్ని స్థాపిద్దామని జనసేన నాయకులు గురాన అయ్యలు పిలు పునిచ్చారు. ఆదివారం ‘అవినీతి ప్రభుత్వం తరిమేద్దాం.. ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిద్దాం’ అనే నినాదంతో ఇంటింటికీ జనసేన కార్యక్రమాన్ని వైఎస్సార్‌నగర్‌లో ప్రారం భించారు. జనసేన పార్టీ రూపొందించిన కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని, వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా జనసేన పనిచేస్తుందన్నారు. జనసేన-టీడీపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని, వైసీపీ అధికారంలోకి రాకపోతే, సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని, వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. టీడీపీ నాయకులు తోట రమేష్, ఝాన్సీ, భరత్, శేఖర్, జనసేన నాయ కులు సతీష్, రాజ్యలక్ష్మి, కవిత, పుష్ప, ఆశ్విని, గాయిత్రీ, రామచంద్రరాజు, గంట్లాన పుష్ప తదితరులు పాల్గొన్నారు.