నాగులప్పలపాడు మండలం కొత్తకోట నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపును సోమవారం ఏపీ ఆరోగ్యశ్రీ ప్రత్యేక అధికారి యాదల అశోక్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్య శిబిరంలో అందుతున్న సేవలు గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. గతంలో ఎన్నడులేని విధంగా పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని సీఎం జగన్ మన ఇంటి ముందుకు తీసుకువచ్చారని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, రోగులు పాల్గొన్నారు.