పలు రాష్ట్రాలలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆన్‌లైన్ (యూపీఐ) లావాదేవీల పైనా ప్రత్యేక నిఘా ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొంది. రూ.50వేలకు మించి నగదు తీసుకెళ్లినా, యూపీఐ ద్వారా ఎక్కువ మందికి డబ్బు పంపితే సంబంధిత పత్రాలు చూపించాల్సి ఉంటుందన్నారు. రూ.10 లక్షల కంటే ఎక్కువ ఆన్‌లైన్ లావాదేవీల వివరాలు బ్యాంకుల నుంచి సేకరిస్తామని స్పష్టం చేశాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికా్‌సరాజ్ బీఆర్కే భవన్‌లో, జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ రోనాల్డ్ రోస్ వివరాలు వెల్లడించారు.