ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జైలులో అస్వస్థతకి గురైన మంత్రి

national |  Suryaa Desk  | Published : Tue, Oct 10, 2023, 10:23 AM

మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టు అయి రిమాండ్‌ ఖైదీ పుళల్‌ కేంద్ర కారాగారంలో ఉంటున్న తమిళనాడు మంత్రి సెంథిల్‌ బాలాజి సోమవారం ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు. దీంతో తొలుత ఆయన్ను జైలులోని ఆస్పత్రికి తరలించి, అక్కడ నుంచి బందోబస్తు మధ్య రాయపురంలోని ప్రభుత్వ స్టాన్లీ ఆస్పత్రిలో చికిత్సలందించారు. చికిత్స ముగిసిన తర్వాత తిరిగి జైలుకు తీసుకెళ్లారు. ప్రస్తుతం పుళల్‌ సెంట్రల్‌ జైలులో ఉంటున్న సెంథిల్‌ బాలాజికి జూన్‌లో నగరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో హృద్రోగ శస్త్రచికిత్స జరిగింది. ఈ ఆపరేషన్‌ ముగిసిన తర్వాత ఆయన్ను తిరిగి జైలుకు తరలించి, ప్రత్యేక వార్డులో ఉంచారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com