గుంటూరు నగరంలోని కలెక్టరేట్లో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 200లకు పైగా అర్జీదారులు వచ్చారు. గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అందుబాటులో లేక పోవడంతో జాయింట్ కలెక్టర్ రాజకుమారి జిల్లా అధికారులతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఆయా అర్జీలను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆదేశించారు. గడువు తేదీ దాటితే సంబంధిత అధికారిని బాధ్యుడిగా చేసి చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.