గుంటూరు నగరంలో కల్తీ నెయ్యి తయారీ చేస్తున్న వారిపై సోమవారం ఆహార భద్రత, నియంత్రణ శాఖ అధికారులు దాడులు చేశారు. పాత పోస్టాఫీసు భవంతి పైభాగంలో కొందరు యువకులు కల్తీ నెయ్యి తయారు చేస్తున్న సమాచారంతో ఆ శాఖ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ నూతలపాటి పూర్ణచంద్రరావు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎస్. రవీంద్రరెడ్డి దాడి చేశారు. వంద లీటర్ల కాచిన కల్తీ నెయ్యి, 40 కిలోల నాసిరకం వెన్న, డాల్డా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.