ఇజ్రాయెల్ పై ప్రస్తుతం హమాస్ సంస్థ చేస్తున్న ఉగ్రవాద దాడి నేపధ్యంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం ఆయన హుబ్బళ్ళి లో మాటాడుతూ.. పాలస్తీనాలో ఉగ్రవాదులకు ఇక్కడి కాంగ్రెస్ మద్దతిస్తుందని విమర్శించారు. తీవ్రవాదులు ఎక్కడున్న తీవ్రవాదులేనని, ఏ సంఘం కూడా ఇలాంటి చర్యలకు మద్దతు ఇవ్వదని అన్నారు. కాంగ్రెస్ సంక్షోభంపై బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.