టీడీపీ చీఫ్ చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఇవాళ ఉదయం నుంచి చంద్రబాబు, సీఐడీ తరఫు లాయర్లు సర్వోన్నత న్యాయస్థానానికి తమ వాదనలు వినిపించారు. తొలుత ఇవాళ మధ్యాహ్నానికి విచారణను వాయిదా వేసిన కోర్టు.. అనంతరం శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా చేస్తూ నిర్ణయం తీసుకుంది.