చంద్రబాబు నాయుడుపై దాఖలైన రెండు పీటీ వారంట్లపై బుధవారం ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కేసులలో చంద్రబాబుపై సీఐడీ పీటీ వారంట్లు దాఖలయ్యాయి. వీటిపై జడ్జి జస్టిస్ హిమబిందు విచారణ జరపనున్నారు. వీటిపై మంగళవారమే విచారణ జరగాల్సి ఉండగా జడ్జి సెలవులో ఉండటంతో విచారణ నేటికి వాయిదా పడింది.