మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలో 2020లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అడవిపాలెంకు చెందిన సత్యనారాయణ మృతి చెందాడు. సైకిల్‌పై వస్తున్న అతన్ని ట్రాక్టర్ ఢీ కొట్టింది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ లంకే డేవిడ్‌పై అప్పటి ఎస్ఐ నాగరాజు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో ట్రాక్టర్ డ్రైవర్ కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి హింమబిందు తీర్పు చెప్పారని మలికిపురం ఎస్ఐ సురేంద్ర మంగళవారం తెలిపారు.