గ్రీన్లామ్ ఇండస్ట్రీస్ తాజాగా ఏపీలో నెలకొల్పిన ప్లాంటులో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. తిరుపతి జిల్లాలోని నాయుడుపేట వద్ద ఉన్న ఈ అత్యాధునిక తయారీ కేంద్రానికి ఏటా 35 లక్షల లామినేట్ షీట్స్, కాంపాక్ట్ బోర్డులను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. నూతన ప్లాంటు కోసం కంపెనీ రూ.239 కోట్లు వెచ్చించింది. పూర్తి సామర్థ్యానికి చేరుకుంటే ఈ ఫెసిలిటీ ద్వారా రూ.600 కోట్ల వార్షికాదాయం సమకూరగలదని కంపెనీ ప్రకటించింది.