వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సంస్కరణల పేరిట దోచుకుంటోందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. గుంటూరు జిల్లా తెనాలిలో మీడియాతో బుధవారం ఆయన మాట్లాడారు. విమర్శించారు. టోఫెల్ శిక్షణ పేరుతో ఈటీఎస్ అనే సంస్థకు ఏటా రూ.వెయ్యి కోట్లు దోచిపెట్టడానికి సిద్ధమైందని, తెలుగు రాష్ట్రాల నుంచి ఏడాదికి 40 వేల మందికి మాత్రమే అమెరికా వీసాలు ఇస్తుంటే.. లక్షలాది మందికి శిక్షణ ఇప్పిస్తామనటం ఏంటని ప్రశ్నించారు.