సీఎం వైఎస్ జగన్ పులివెందుల నుండి విశాఖ ఉత్తర నియోజకవర్గానికి వచ్చి పోటీ చేయమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు సవాల్ విసిరారు. పొత్తు ఉన్నా, లేకున్నా , జగన్ మోహన్ రెడ్డి పోటీ చేసినా విశాఖపట్నం ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గంలో తన గెలుపును ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. కాబోయే ఎమ్మెల్యే నేనే అంటూ బుధవారం విశాఖలో విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.