ధర్మవరం పట్టణం యాదవ వీధికి చెందిన సుజాత(30) అనే వివాహిత తన కూతురితో కలిసి ధర్మవరం రైల్వే పట్టాల వద్ద ఉండగా బుధవారం రైల్వే ఎస్ ఐ కే గోపి కుమార్ గమనించి ధర్మవరం రైల్వే పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకొని ఆమె భర్త వెంకటేశ్వరప్రసాద్ తో పాటు అతని స్నేహితుడిని పిలిపించి భార్య భర్తలిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి ఆత్మహత్య నేరమని చెప్పి ఇంటికి పంపించడం జరిగింది.