డిల్లీలోని కక్రోలా ప్రాంతంలో మాతా మససని చౌకీ దర్బార్ పేరిట వినోద్ కాశ్యప్(33) యూట్యూబ్ చానల్ తో పాటు ఒక ఆశ్రమం కూడా నడుపుతున్నాడు. ఇద్దరు అమ్మాయిల నుండి వచ్చిన వేరు వేరు ఫిర్యాదుల ఆధారంగా స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు వినోద్ ను బుదవారం డిసిపి ద్వారక్ అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తమ సమస్యలను పరిష్కరిస్తానంటూ పిలిపించుకొని, గురు సేవ చేయాలని బలవంతం చేసేవాడని తెలిపారు.