ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం జగనన్న ఆరోగ్య సురక్షను బుధవారం రాయదుర్గం పట్టణం 1వ సచివాలయం 2వ వార్డు నందు ప్రారంభించారు. సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్, గృహ సారతులతో కలిసి మునిసిపల్ చైర్ పర్సన్ పోరాళ్ళు శిల్ప పాల్గొన్నారు. ప్రతి ఇంటింటికి వెళ్లి ఆరోగ్య సమస్యలను తెలుసుకొని అనారోగ్యంతో ఉన్న వారిని గుర్తించి ఈ నెల 31న జరిగే క్యాంపులో పాల్గొనాలన్నారు.