స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేస్తున్నారే తప్ప సాధారణ బెయిల్ తీసుకుని న్యాయపోరాటానికి ఎందుకు సిద్ధం కావడం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృషారెడ్డి ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..... ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారంటూ ఐటీ శాఖ నోటీసులు జారీ చేసినా ఆ శాఖ పరిధిలోకి రాదంటూ దబాయించే ప్రయత్నం చేశారని చెప్పారు. కక్షసాధింపు చర్యలకు పాల్పడాల్సినంత అవసరం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే చంద్రబాబును అరెస్ట్ చేస్తే అది కక్షసాధింపు అవుతుందన్నారు. ఆయన బయట ఉంటూ పొంతన లేని మాటలు మాట్లాడితే వైసీపీకి లాభమని చెప్పుకొచ్చారు. చంద్రబాబు జైల్లో ఉంటే ఏమిటి? బయట ఉంటే ఏమిటని జగన్ అనడానికి కారణమిదేనని సజ్జల పేర్కొన్నారు.